నా కుటుంబ సభ్యుల్లారా.. రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం: మోదీ

నా కుటుంబ సభ్యుల్లారా.. రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం: మోదీ

తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.  అనేక రోడ్‌ కనెక్టివిటీ ప్రాజెక్ట్‌లు ప్రారంభించుకున్నామని... రోడ్డు, రైలు కనెక్టివిటీతోనే అభివృద్ధి ముడిపడి ఉందని తెలిపారు.  దేశంలో నిర్మించే 5 టెక్స్‌టైల్‌ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించామని గుర్తు చేశారు. హన్మకొండలో నిర్మించే టెక్స్‌టైల్‌ పార్క్‌తో వరంగల్‌, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. రోడ్డు కనెక్టివిటీ  ప్రాజెక్ట్‌ల ద్వారా అభివృద్ధి జరుగుతుందని...తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర మధ్య రవాణా సదుపాయాలు మెరుగవుతాయి అని ప్రధాని మోదీ తెలిపారు. 

Also Read :- తెలంగాణకు పసుపు బోర్టు ప్రకటించిన మోడీ

 నా కుటుంబ సభ్యులారా చాలా సంతోషంగా ఉంది అని ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడారు. పలుమార్లు నా కుటుంబ సభ్యులారా అని ప్రసంగించారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో మహిళా బిల్లు ఆమోదించుకున్నామని గుర్తు చేశారు. పార్లమెంట్‌లో నారీ శక్తి బిల్లును ఆమోదించుకున్నామని..ప్రస్తుతం  దేశంలో పండుగల సీజన్‌ నడుస్తోందని చెప్పారు. నవరాత్రికి ముందే శక్తి పూజలు ప్రారంభించుకున్నామని మోదీ తెలిపారు. .