మెట్రోలో మోడీ ప్రయాణం.. ముస్లిం సోదరులతో ముచ్చట్లు

మెట్రోలో మోడీ ప్రయాణం.. ముస్లిం సోదరులతో ముచ్చట్లు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ఢిల్లీలోని ఇస్కాన్ గ్లోరీ ఆఫ్ ఇండియా కల్చరల్ సెంటర్ నిర్వహిస్తున్న గీత ఆరాధన ఉత్సవాల్లో పాల్గొనేందుకు మెట్రో రైలులో వెళ్లారాయన. ఓ సాధారణ పౌరుడిలా మెట్రో రైలులో తోటి ప్రయాణికుల మధ్య కూర్చుని ప్రయాణం చేశారు. ఖాన్ మార్కెట్ వద్ద రైలు ఎక్కిన ప్రధాని నెహ్రూ ప్లేస్ స్టేషన్లో దిగారు.

పసి పిల్లలను ముద్దు చేసిన ప్రధాని

మెట్రో ప్రయాణంలో ప్రధాని మోడీ పక్కన కూర్చుని వెళ్లేందుకు యువత, మహిళలు అంతా ఉత్సాహం చూపించారు. పలువురు యువతులు, వృద్ధులు ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు. రైలులో ప్రయాణిస్తున్న కొందరు ముస్లింలతో ప్రధాని కొద్ది సేపు ముచ్చటించారు. రైలులో పసిపిల్లలతో ప్రయాణిస్తున్న తల్లులు మోడీ వద్దకు వచ్చారు. వారి చేతిలో నుంచి పిల్లలను ఆయన ఎత్తుకుని ముద్దు చేశారు. చిన్నారులను కొద్ది సేపు ఆడించారు.