నేను అదృష్టవంతుడిని .. రైనాకు మోడీ లేఖ

నేను అదృష్టవంతుడిని .. రైనాకు మోడీ లేఖ

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఎంఎ ధోనికి లేఖ రాసి అభినందించిన ప్రధాని మోడీ లేటెస్ట్ గా  సురేష్ రైనాకు లేఖ రాసి అభినందించారు. ఆగస్టు 15 న మీరు తీసుకున్న నిర్ణయం మీ జీవితంలో ఎంత కఠినమైనదో తాను ఊహించగలనన్నారు మోడీ. రిటైర్మెంట్ అనే పదంతో మీ సేవల్ని తక్కవ చేయలేమన్నారు. ఇంకా మీకు ఆడే సత్తా ఉన్నవయసులో రిటైర్ అవుతారని తాను ఊహించలేదన్నారు. ఇంకా మీరు  యంగేజ్ లో ..శక్తి సామర్థ్యాలతో ఉన్నారన్నారు. మీ రియల్ లైఫ్ లో సెకండ్  ఇన్నింగ్స్  సజావుగా సాగాలని కోరారు.

ఈ దేశం మిమ్మల్ని కేవలం బ్యాట్స్ మెన్ గానే గుర్తించుకోదన్నారు. అవసరమైనప్పుడు జట్టుకు బౌలర్ గా, ఫీల్డర్ గా మీరందించిన సేవలను మర్చిపోలేరన్నారు. ఇటీవల అధ్బుతమైన క్యాచ్ లతో రైనా తన దైన ముద్రవేశారన్నారు.  గ్రౌండ్ లో మీరు చురుకుగా ఉండి ఆదా  చేసిన రన్స్ ను కౌంట్ చేయాలంటే చాలా రోజులు పడుతుందన్నారు. ముఖ్యంగా  టీ20ల్లో రైనాను స్పెషల్ అని అన్నారు. అలాగే 2011 వరల్డ్ కప్ క్వార్టర్  ఫైనల్ మ్యచ్ ను అహ్మదాబాద్ లోని మోతేరా స్టేడియంలో  తాను స్వయంగా చూశానన్నారు మోడీ . ఆ మ్యాచ్ లో భారత్ గెలవడంతో రైనా కీలక పాత్ర పోషించాడన్నారు. ఆ మ్యాచ్ లో రైనా కవర్ డ్రైవ్ లను ప్రత్యక్షంగా చూసినందుకు తాను అదృష్టవంతుడిగా ఫీలవుతున్నానన్నారు మోడీ. భారత జట్టును నంబర్ వన్ గా నిలబెట్టడంలో  మీ కృషి కీలకమైనదంటూ రైనాకు కృతజ్ఞతలు తెలిపారు మోడీ.

మోడీ లేఖకు ట్విటర్లో రైనా రిప్లై ఇచ్చారు. మోడీకి థ్యాంక్స్ చెప్పారు.  దేశం కోసం ఆడినప్పుడు తాము రక్తం చిందిస్తామన్నారు.దేశ ప్రజల ప్రశంసలు, ప్రధాని మోడీ  అభినందించడం కంటే గొప్ప విషయం ఇంకేమి లేదన్నారు రైనా.