
ప్రతీ ఏడాది లాగే ఈ సారి కూడా ప్రధాని నరేంద్రమోడీకి పాకిస్తాన్ సోదరి కమర్ మొహిసిన్ షేక్ రాఖీ పంపారు. మోడీ ఆయురారోగ్యాలతో వందేళ్లు జీవించాలని ప్రార్థిస్తూ ఈ రాఖీ పంపినట్టు కమర్ తెలిపారు. మోడీకి గత 25 ఏళ్ల నుంచిమోడీకి రాఖీ కడుతున్నానని… అప్పుడు ఆయన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త అని తెలిపారు. తన పట్టుదల, శ్రమతో ప్రధాన మంత్రి వరకు ఎదిగారని ప్రశంసించారు. మోడీని తనతో పాటు తన భర్త మొహిసిన్, కుమారుడు సుఫీయాన్ కూడా అభిమానిస్తారని తెలిపారు. మోడీ నుంచి పిలుపు వస్తే తాను తప్పకుండా ఢిల్లీ వెళ్తానని కమర్ చెప్పారు. చాలా సార్లు మోడీ… కమర్‌కు ఫోన్ చేసి రాఖీ కట్టించుకోవడానికి పిలిచారు. కమర్ భర్త, కొడుకు గురించి అడిగి తెలుసుకునే వారు. మోడీ చాలా సాధారణంగా కనిపించినా పనులు మాత్రం గొప్పగా చేస్తారన్నారు కమర్. తన ఇద్దరు చెల్లెళ్లు కూడా మోడీకి రాఖీ కట్టాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. పాకిస్తాన్ దేశానికి చెందిన కమర్ మొహిసిన్ భారత్‌కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. ప్రస్తుతం వారు అహ్మదాబాద్‌లో ఉంటున్నారు.