
హైదరాబాద్, వెలుగు: బాలికలకు సురక్షిత ఆర్థిక భవిష్యత్తును అందించడానికి పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) సహకారంతో సుకన్య సమృద్ధి సురక్షా యోజన (ఎస్ఎస్ఎస్వై) పేరుతో గ్రూప్ టర్మ్ లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను పరిచయం చేసింది. రూ.25 వేల నుంచి రూ.1.50 లక్షల మధ్య పేమెంట్ఆప్షన్స్ఉంటాయి.
తల్లి/తండ్రి మరణిస్తే ఎస్‌ఎస్‌వై ఖాతాకు మిగిలిన వార్షిక చెల్లింపులు పీఎన్‌బీ మెట్‌లైఫ్ ద్వారా జరుగుతాయి. 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల తల్లిదండ్రులు ఈ పాలసీని తీసుకోవచ్చు. 64 సంవత్సరాల వయస్సు వరకు కవరేజ్ కొనసాగుతుంది.