మిస్టికల్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా పోచమ్మ

మిస్టికల్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా పోచమ్మ

అంబటి అర్జున్, శ్రీ పూజా రెడ్డి, స్నేహా కీలక పాత్రల్లో నటించిన వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌ ‘పోచమ్మ’.  రమేష్ ఇంద్ర దర్శకత్వంలో శ్రుతి నాయుడు నిర్మిస్తోంది. మిస్టికల్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా వస్తోన్న ఈ సిరీస్‌‌‌‌ గ్లింప్స్‌‌‌‌ను దర్శకుడు బుచ్చిబాబు సాన రిలీజ్ చేసి బెస్ట్ విషెస్‌‌‌‌ చెప్పారు. తన గొప్పతనం, మహిమను అంచనా వేయక తప్పులు చేసే వాళ్లను పోచమ్మ దేవత ఎలా శిక్షించింది, తనను పూజించే వారిని ఎలా రక్షించింది అనే అంశాలను గ్లింప్స్‌‌‌‌లో చూపించారు.  ‘పోచమ్మకు కాపాడటం తెలుసు, వేధించడం తెలుసు, అవసరమైతే చంపడం కూడా తెలుసు’ లాంటి డైలాగ్స్‌‌‌‌ సిరీస్‌‌‌‌పై ఆసక్తిని మరింత పెంచాయి.  ఈనెల 17 నుంచి ఆహాలో ఇది స్ట్రీమింగ్ కానుంది.