వరంగల్ MLC : TRS అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గెలుపు

వరంగల్ MLC : TRS అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గెలుపు

వరంగల్ అర్బన్ : వరంగల్ స్థానిక సంస్థల MLCగా TRS నేత పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. ఈ ఉదయం8 గంటలకు కౌంటింగ్ మొదలైన గంట సేపట్లోనే.. ఫలితం ప్రకటించారు అధికారులు. టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి 848 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ నేత ఇనుగాల వెంకట్రాం రెడ్డికి 23 ఓట్లు పడ్డాయి. చెల్లని ఓట్లు 12 ఉన్నట్టు అధికారులు చెప్పారు. 825 ఓట్ల భారీ తేడాతో పోచంపల్లి గెలిచినట్టు అధికారులు చెప్పారు.

వరంగల్ స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ఎనుమాముల మార్కెట్‌లో జరిగింది. ప్రాధాన్యతా క్రమంలో ఓట్ల లెక్కింపు చేశారు. మే 31న జరిగిన పోలింగ్ లో.. మొత్తం 902 మంది ఓట్లకు గాను 883 ఓట్లు పోలయ్యాయి. బరిలో ఐదుగురు అభ్యర్థులు నిలిచారు. ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ బలపరిచిన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి గెలుపొందారు.