గంగిరెద్దులను ఎత్తుకెళ్లిన్రు ..పోచారం ఐటీ కారిడార్పరిధిలో ఘటన

గంగిరెద్దులను ఎత్తుకెళ్లిన్రు ..పోచారం ఐటీ కారిడార్పరిధిలో ఘటన

ఘట్​కేసర్​, వెలుగు: ఇంటి ముందు కట్టేసిన రెండు గంగిరెద్దులను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. పోచారం ఐటీ కారిడార్​పరిధిలోని అన్నానగర్ కాలనీకి చెందిన ఆవుల కనకయ్య, అతని బంధువు మల్లయ్య గంగిరెద్దుల ఆటను ప్రదర్శిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 21న రాత్రి కనకయ్య తన గంగిరెద్దులను ఇంటి ముందు కట్టేసి నిద్రపోగా, అర్ధరాత్రి దాటిన తర్వాత లేచి చూసేసరికి కనిపించలేదు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.