షావోమీ సబ్‌బ్రాండ్ పోకో.. ఎఫ్5 పేరుతో ఇండియా మార్కెట్లో 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో 6.67-అంగుళాల స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 2 ప్రాసెసర్, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఉంటాయి. 8జీబీ వేరియంట్ ధర రూ. 29,999 కాగా, 12 జీబీ వేరియంట్ ధర రూ. 33,999. రెండు వేరియంట్లలో 256 జీబీ స్టోరేజీ ఉంటుంది.
