అశ్వారావుపేట పట్టణంలో.. యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు

అశ్వారావుపేట పట్టణంలో.. యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు

అశ్వారావుపేట, వెలుగు: ప్రేమ పేరుతో బాలికను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఎస్సై యయాతి రాజు తెలిపిన వివరాల  ప్రకారం..  పట్టణంలోని వడ్డెర బజారుకు చెందిన మక్కేళ్ల మారేశ్​ 16 ఏళ్ల యువతిని ప్రేమ పేరుతో లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. 

బాలిక తల్లి ఫిర్యాదుతో  మారేశ్​పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.