మైనర్పై లైంగిక దాడి కేసు..వ్యక్తికి పదేళ్లు జైలు శిక్ష

మైనర్పై లైంగిక దాడి కేసు..వ్యక్తికి పదేళ్లు జైలు శిక్ష

 ముంబై: పెళ్లి చేసుకుంటానని 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన వ్యక్తికి ముంబై ప్రత్యేక పోక్సో కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. పోక్సో చట్టం అన్ని మతాలకు వర్తిస్తుందని, మరే ఇతర చట్టంపైనా ప్రభావం చూపుతుందని,15ఏళ్ల బాలికతో లైంగిక సంబంధం పెట్టుకునే ఆచారాలను నిషేధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది. 

ప్రాసిక్యూషన్ ప్రకారం..బాలిక తల్లి ఇద్దరు సోదరిలతో కలిసి జీవిస్తోంది. 2018లో బాధితురాలి తల్లితో ఉన్న పరిచయంతో ఆమెకు దగ్గరయ్యాడు. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ మరింత దగ్గరయ్యాడు. తనకు పెళ్లి కాలేదని.. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు గర్భవతి అయింది. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లి ఆందోళన చెంది ధారావి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 

ఏకకాలంలో నలుగురు భార్యలను కలిగి ఉండటాన్ని తమ మతం అనుమతిస్తుందని..అందుకే బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని  దోషి అయిన 31 ఏళ్ల వ్యక్తి తరపు లాయర్ కోర్టులో వాదించాడు. పోక్సో చట్టం అన్ని మతాలకు వర్తిస్తుందని, మరే ఇతర చట్టంపైనా ప్రభావం చూపుతుందని,15ఏళ్ల బాలికతో లైంగిక సంబంధం పెట్టుకునే ఆచారాలను నిషేధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి సీవీ పాటిల్ తీర్పును వెల్లడించారు.