
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారాన్ని కవి, సాహిత్య విమర్శకుడు పత్తిపాక మోహన్ అందుకున్నారు. సోమవారం ఢిల్లీలోని త్రివేణి కళా సంఘంలో సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డా.చంద్రశేఖర్ కంబార్, అకాడమీ సెక్రటరీ కె. శ్రీనివాసరావుల చేతుల మీదుగా పత్తిపాక మోహన్ అవార్డును స్వీకరించారు. ఈ అవార్డు కింద రూ. 50 వేల నగదు, తామ్రపత్రం అందించారు. ఈ ఏడాది దేశంలో 22 మందికి బాల సాహిత్య పురస్కారాలు కేంద్ర సాహిత్య అకాడమీ అందించింది. తెలుగులో ‘బాలల తాత బాపూజీ’ గేయ కథకు గాను పత్తిపాక మోహన్‌ను ఈ అవార్డు వరించింది.