మహబూబాబాద్, వెలుగు: డోర్నకల్ మండలం పెరుమాండ్ల సంకీస గ్రామ శివారులో ఉన్న రెడ్డి చేపల చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలపడంతో భారీ సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగినట్లు స్థానికులు తెలిపారు.
బుధవారం ఉదయం మత్స్యకారులు చెరువు వద్దకు వెళ్లి చూడగా చేపలు నీటిపై తేలియాడుతూ కనిపించాయి. సుమారు మూడు క్వింటాళ్లకు పైగా చేపలు చనిపోయినట్లు గుర్తించారు. ఈ ఘటన వల్ల తమకు దాదాపు రూ.4 లక్షల మేర నష్టం వాటిల్లిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. కుట్రపూరితంగానే ఎవరో చెరువులో విషం కలిపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
