పోక్సో కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష..మెదక్ సెషన్స్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు

పోక్సో కేసులో 20 ఏండ్ల  జైలు శిక్ష..మెదక్ సెషన్స్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు

శివ్వంపేట, వెలుగు:  పోక్సో కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ  మెదక్ సెషన్స్ అండ్  ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి నీలిమ గురువారం తీర్పు ఇచ్చారు. ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శివ్వంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన దుర్గయ్య(58), 2023 సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు పంపారు. 

కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయగా, సాక్ష్యాధారాల ఆధారంగా విచారించి నిందితుడు దుర్గయ్యకు జైలు శిక్ష, జరిమానా విధిస్తు జడ్జి తీర్పు చెప్పారు. కేసులో నిందితుడికి శిక్ష పడేలా వ్యవహరించిన తూప్రాన్ సీఐ రంగకృష్ణ, శివ్వంపేట ఎస్ఐ మధుకర్ రెడ్డి, కోర్టు కానిస్టేబుల్ కృష్ణ, రవి, ఆనంద్ ను ఎస్పీ అభినందించారు.