V6 News

పోక్సో కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష.. ములుగు జిల్లా పోక్సో స్పెషల్ కోర్టు తీర్పు

పోక్సో కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష.. ములుగు జిల్లా పోక్సో స్పెషల్  కోర్టు తీర్పు

ములుగు, వెలుగు : పోక్సో కేసులో నిందితుడికి 20ఏండ్ల జైలు శిక్ష, రూ. 6 వేల జరిమానా విధిస్తూ ములుగు జిల్లా పోక్సో స్పెషల్ కోర్టు జడ్జి ఎస్ వీపీ సూర్యచంద్రకళ శుక్రవారం తీర్చు ఇచ్చారు.  వివరాలను జిల్లా ఎస్పీ సుధీర్​ రాంనాథ్ కేకన్ వెల్లడించారు. 

ములుగు మున్సిపాలిటీ పరిధి బండారుపల్లికి చెందిన ఆటో డ్రైవర్ ఏల్పుల రవితేజ.. అదే గ్రామానికి చెందిన బాలికను వేధిస్తుండేవాడు. 2020లో బాధితురాలి తండ్రి పోలీస్​స్టేషన్​ లో ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై పోక్సో యాక్ట్​ కింద కేసు నమోదు చేశారు.  

కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా నిందితుడికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.  కేసు దర్యాప్తు అధికారులు డీఎస్పీ కిషోర్​, సీఐ దేవేందర్​రెడ్డి, ఎస్ఐలు ఫణి, లక్ష్మణ్​, సీడీవో స్రవంతిని ఎస్పీ అభినందించారు.