తెలుగు పాటలతో ఇరగదీస్తున్న పోలాండ్ కుర్రాడు

తెలుగు పాటలతో ఇరగదీస్తున్న పోలాండ్ కుర్రాడు

తెలుగు భాష పై ఉన్న ఇష్టంతో ఓ విదేశీ కుర్రాడు తన గాత్రంతో తెలుగులో అద్భుతంగా పాటలు పాడుతున్నాడు. పోలాండ్‭కి చెందిన బుజ్జీ అనే కుర్రాడు తెలుగులో పాటలు పాడి అందరినీ ఆకట్టుకుంటున్నాడు.  "నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తర వైతిరయ్యో ఓ ఓ ఓఓ ఇంచు ఇంచులోన పొంచి ఉన్న అంటూ నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ మూవీలోని పాటను చక్కడగా పాడి వినిపించాడు. అచ్చ తెలుగు పదాలను కూడా ఎలాంటి తడబాటు లేకుండా కుర్రాడు పలకిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

అంతకుముందు కూడా ఈ కుర్రవాడు పాటిన పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో పవన్‌కల్యాణ్‌ నటించిన అజ్ఞాతవాసి సినిమాలోని "కొడకా కోటేశ్వర్రావూ ఖరుచైపోతవురో అంటూ పాట అందుకున్నాడు. ఆ తర్వాత పాడుతా తియ్యగా కమ్మగా అంటూ అన్నమయ్య కీర్తనులు, ఘంటసాల పాటలు, శ్రీకృష్ణదేవరాయులు తెలుగు భాష గురించి ఈ బుల్లోడు పలికిన పలుకులు అందరినీ ఆకట్టుకున్నాయి.