వార్సా: ఉక్రెయిన్పై దాడిని వ్యతిరేకిస్తూ రష్యాపై ఇప్పటికే పలు దేశాలు ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ పుతిన్ ఖాతరు చేయకపోవడంతో రష్యా నుంచి దిగుమతులను తగ్గించుకుంటున్నాయి. ఇందులో భాగంగా రష్యా నుంచి ఆయిల్ దిగుమతులను క్రమంగా తగ్గిస్తూ ఈ ఏడాది చివరి నాటికి పూర్తిగా బంద్ చేయాలని నిర్ణయించినట్లు పోలెండ్ ప్రధాని బుధవారం వెల్లడించారు. ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పీఎం మాతేవుజ్ మొరావిస్కి చెప్పారు. రష్యా నుంచి బొగ్గు దిగుమతులపై ఆయన మంగళవారం బ్యాన్ విధించారు. గ్యాస్ దిగుమతులపైనా వచ్చే మే నెలలో బ్యాన్ విధిస్తామని ప్రధాని చెప్పారు. యూరోపియన్ దేశాలన్నీ ఇదే పద్ధతి ఫాలో కావాలని, రష్యా నుంచి దిగుమతులను నిషేధించాలని కోరారు.
