రాజమండ్రికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ

రాజమండ్రికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ

హైదరాబాద్, వెలుగు: పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఆఫీసును హైదరాబాద్​నుంచి రాజమండ్రికి తరలించనున్నారు. ఈ మేరకు ప్రాజెక్టు చీఫ్​ ఇంజినీర్​కు పీపీఏ మెంబర్ ​సెక్రటరీ రఘురామ్​ మంగళవారం లేఖ రాశారు. రాజమండ్రిలోని ఏఎంజీ కాలేజీ ఎదురుగా 11,550 స్క్వేర్ ​ఫీట్ల బిల్డింగ్, పిట్టలవాయి చెరువు సమీపంలోని 7 వేల స్క్వేర్ ​ఫీట్ల విష్ణు నివాసం భవనం, పిడింగొయ్య వద్ద గల 12 వేల చదరపు అడుగుల భవనాలల్లో  ఏది అనుకూలంగా ఉందో పరిశీలించి ఫైనల్​చేయాలని తెలిపారు.