V6 News

పీపీఏ మీటింగ్మినిట్స్ సవరణ.. తెలంగాణ అభ్యంతరాలనూ చేర్చిన అధికారులు

పీపీఏ మీటింగ్మినిట్స్ సవరణ.. తెలంగాణ అభ్యంతరాలనూ చేర్చిన అధికారులు

హైదరాబాద్​, వెలుగు: పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) ఇటీవల నిర్వహించిన 17వ మీటింగ్​ కు సంబంధించిన మినిట్స్​ను సవరించింది. వివిధ అంశాలపై నవంబర్​ 7న హైదరాబాద్​లో ఏపీ, తెలంగాణ సహా సభ్య రాష్ట్రాలతో మీటింగ్ ​నిర్వహించింది.  పోలవరం ప్రాజెక్టును యాక్చువల్​ కంపొనెంట్​ను మించి విస్తరిస్తున్నారని మన అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలవరం కుడి కాల్వ కెపాసిటీని 12,250 క్యూసెక్కుల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచుతున్నారని, అది ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.    

కొద్దిరోజుల క్రితం రిలీజ్​చేసిన మీటింగ్​మినిట్స్​లో మాత్రం తెలంగాణ అభ్యంతరాలను పీపీఏ చేర్చలేదు. వెంటనే మినిట్స్​లో తమ అభ్యంతరాలనూ చేర్చాలని కోరుతూ ఇరిగేషన్​ ప్రిన్సిపల్​ సెక్రటరీ రాహుల్​ బొజ్జా.. పీపీఏకు లేఖ రాశారు. దీంతో తాజాగా పీపీఏ ఆ వ్యాఖ్యలనూ  మినిట్స్​లో చేర్చి  విడుదల చేసింది.