చెన్నైలో పోలీసులు, ఫైర్ సిబ్బంది మాక్ డ్రిల్

చెన్నైలో పోలీసులు, ఫైర్ సిబ్బంది మాక్ డ్రిల్

చెన్నైలో పోలీసులు, ఫైర్ డిపార్ట్ మెంట్ అధికారులు సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రజల్ని ఎలా కాపాడాలి అనేదానిపై అవగాహన కల్పించారు. జలమయం అయిన కాలనీలలో నుంచి బయటపడేందుకు అందుబాటులో ఉన్న రబ్బర్ ట్యూబులు.. నీటిపై తేలియాడే తెడ్లు, లైఫ్ జాకెట్లు  ఎలా ఉపయోగించుకోవాలి..? వరదల నుంచి ఎలా బయటపడాలి.. ?  సురక్షిత విధానాలేమిటి.. అనే విషయాలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. వరదలు, విపత్తు సమయాల్లో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితోపాటు.. రక్షించే ప్రయత్నాలు చేసేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. పాటించాల్సిన విధానాలను కూడా మాక్ డ్రిల్ ద్వారా తెలియజేశారు. 


తరచూ భారీ వర్షాలు.. వరదలతో లోతట్టు ప్రాంతాలు నీటమునగడం వర్షాకాలంలో సాధారణమైపోతున్న విషయంతెలిసిందే. ఇలాంటి పరిస్థితులపై నష్ట నివారణ చర్యల్లో భాగంగా తమిళనాడు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఉమ్మడిగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రజల్లో అవగహన కోసంనిర్వహించిన ఈ మాక్ డ్రిల్ కార్యక్రమంలో విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. వరదల సమయంలో ఎలా వ్యవహరించాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇతరుల్ని ఎలా రక్షించాలి అనే విషయాలను ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.