విచారణ పేరుతో పోలీసులు టార్చర్ చేస్తున్రు : లాయర్ శ్రీనివాస్

విచారణ పేరుతో పోలీసులు టార్చర్ చేస్తున్రు : లాయర్ శ్రీనివాస్

మొయినాబాద్ ఫాంహౌస్ కేసుపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న శ్రీనివాస్, రామచంద్రభారతి తరుపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. విచారణ పేరుతో పోలీసులు టార్చర్ చేస్తున్నారని శ్రీనివాస్ తరుపు న్యాయవాది వాదించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా శ్రీనివాస్ సహా అతడి కుటుంబాన్ని వేధిస్తున్నారని చెప్పారు. బండి సంజయ్, రఘునందన్రావు పేరు చెపితే 5 నిమిషాల్లో విచారణ పూర్తవుతుందని సిట్ అధికారులు బెదిరిస్తున్నారని..రఘునందన్ రావుతో శ్రీనివాస్కు పరిచయం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

మరోవైపు పోలీసులు ఉద్ధేశ్యపూర్వకంగా మల్టిపుల్ కేసులు నమోదు చేస్తున్నారని రామచంద్రభారతి తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయని హైకోర్టు ప్రశ్నించగా..బంజారాహిల్స్లో కేసు నమోదు చేశారని న్యాయవాది జవాబిచ్చారు. బంజారాహిల్స్లోనే కేసు ఎందుకు నమోదు చేశారని న్యాయస్థానం ప్రశ్నించగా..సిట్ కార్యాలయం అక్కడే ఉందని ప్రభుత్వం తరుపు న్యాయవాది చెప్పారు.