బిగ్ బాస్ ఫేం సరయు అరెస్ట్

బిగ్ బాస్ ఫేం సరయు అరెస్ట్

బిగ్ బాస్ బ్యూటీ, సెవెన్ హార్ట్ ఫేమ్ సరయును పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపటి క్రితమే హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీసులు సెలబ్రిటీ సరయును అరెస్టు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఓ వీడియోలో నటించిందని ఫిర్యాదు అందడంతో ఆమెను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని హిందూ సంఘాల నేత అశోక్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సరయుపై కేసు నమోదు చేసి బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం అందుతోంది. సరయుపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

సరికొత్తగా వెడ్డింగ్ ఇన్విటేషన్

టాలీవుడ్.. మోడీ పొగిడారని పొంగిపోవద్దు