కుండీల్లో గంజాయి మొక్కల పెంపకం.. పోలీసుల సోదాలు

కుండీల్లో గంజాయి మొక్కల పెంపకం.. పోలీసుల సోదాలు

మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ పోలీస స్టేషన్ పరిధిలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్న వ్యక్తులను పట్టుకున్నారు పోలీసులు. యాప్రల్ గోదావరి గార్డెన్ లోని ఓ ఇంట్లో  ఏడు పెద్ద కుండిల్లో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇంట్లో సోదాలు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అల్వాల్ డిప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సమక్షంలో పంచనామా నిర్వహించి, గంజాయి మొక్కలను సీజ్ చేశారు. నిందితులను జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.

మరిన్ని వార్తల కోసం..

ఛార్జీల పెంపు తప్పదు: ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి

12 సెంటీమీటర్ల తోకతో పుట్టిన శిశువు

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ నిర్దోషి: పాక్ కోర్టు