
సుప్రీం కోర్టుకు వెళ్తున్న ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్తున్న అభ్యర్థి యాసం ప్రదీప్, కళ్యాణ్ లను శంషాబాద్ ఎయిర్ పోర్టులో గోదావరి ఖనీ పోలీసులు అరెస్ట్ చేశారు. బోర్డింగ్ సమయంలో అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డుపై అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. 7 మార్కుల విషయంలో ఎస్సై అభ్యర్థి ప్రదీప్ వేసిన పిటిషన్ ను హైకోర్ట్ సమర్థించడమే గాకుండా ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. లేటెస్ట్ గా నియామక బోర్డ్ అక్రమాలపై ప్రదీప్ సుప్రీం కోర్టుకు వెళ్తుండగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. తమపై ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసులు పెడుతున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.