శనివారం ( జనవరి 3 ) అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు ఆదిలాబాద్ రైతులు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు రైతులను అడ్డుకొని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ క్రమంలో అసెంబ్లీ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదిలాబాద్ లోని కోర్ట చనాక ప్రాజెక్ట్ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు ఇవాళ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. తెలంగాణాలో రైతులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని.. ఆదిలాబాద్ రైతుల భూములకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.
తెలంగాణ లో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని.. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల పరిస్థితిని అర్థం చేసుకొని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ముట్టడికి యత్నించిన రైతులను అడ్డుకొని అరెస్ట్ చేశారు పోలీసులు. రైతులకు సహకరించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను అసెంబ్లీ నుంచి పంపించేశారు పోలీసులు.
