ఎస్వీబీసీ ఛానల్.. పోర్న్ లింకు ఘటనలో అరెస్టు

ఎస్వీబీసీ ఛానల్.. పోర్న్ లింకు ఘటనలో అరెస్టు

తిరుమల: ఎస్వీబీసీ ఛానల్‌లో పోర్న్ వీడియో ఘటనలో అరెస్టులు పర్వం కొనసాగుతోంది. శతమానం భవతి కార్యక్రమం కోసం ఎస్బీబీసీ ఛానెల్ కు మెయిల్ చేసిన ఓ భక్తుడికి పోర్న్ లింక్ పంపడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ లింక్ పొందిన భక్తుడు టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డికి మెయిల్ చేశాడు. దీంతో ఈ విషయమై ఎస్వీబీసీ అధికారులతో పాటు సైబర్ క్రైమ్ టీమ్ విచారణ చేశారు.ఈ విచారణ చేసిన సమయంలో ఐదుగురు ఉద్యోగులు పోర్న్ సైట్లు చూస్తున్నారని గుర్తించారు. మరో 25 మంది ఉద్యోగులు మాత్రం ఇతర సైట్లు చూస్తున్నట్టుగా గుర్తించారు. శతమానం భవతి కోసం మెయిల్ చేసిన భక్తుడికి పోర్న్ సైట్ లింక్ పంపిన ఎస్వీబీసీ లో పనిచేసే హరికృష్ణ అనే ఉద్యోగిని పోలీసులు శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు.ఇప్పటికే హరికృష్ణను విధుల నుంచి ఎస్వీబీసీ యాజమాన్యం తొలగించింది.