చేవెళ్లలో రైతుల ఆందోళన

చేవెళ్లలో రైతుల ఆందోళన

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని చందన్ వెల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిని రైతుల నుంచి స్వాధీనం చేసుకొని వేల్స్ పన్ కంపెనీకి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టబెట్టింది. కానీ భూనీర్వాసితులకు ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో సాయం అందలేదు. దీనిపై రైతులు ఆందోళన చేపట్టారు. మాకు అందవలసిన సహాయాన్ని అందివాలని లేదంటే మా భూమిని మాకు ఇవ్వాలని ఆందోళనకు దిగారు. రైతులకు నష్ట పరిహారం అందడంతో అవకతవకలు జరిగాయని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే సర్వే చేసి తమకు రావలసిన నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.

అయితే అధికారులు ఎంతకు స్పందించక పొవడంతో రైతులు కోర్టు నుంచి స్టే తీసుకుని భూమిని సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు వచ్చి రైతులను అక్రమ అరెస్ట్ చేశారు. ఈ అక్రమ అరెస్టును నీరసిస్తూ రైతులు షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ముంబై బెంగళూరు లింకు హైవే మీద ధర్నాను నిర్వహించారు. దీనిని కండిస్తూ పోలీసులు రైతులను, బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.