నకిలీ ఐఏఎస్ గుట్టు రట్టు... భార్యకే రూ. 2 కోట్లు టోకరా

నకిలీ ఐఏఎస్ గుట్టు రట్టు... భార్యకే రూ. 2 కోట్లు టోకరా

హైదరాబాద్ లో నకిలీ ఐఏఎస్ కం నకిలీ డాక్టర్ గుట్టు రట్టయ్యింది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సందీప్ అనే ఫేక్ ఐఏఎస్ కం ఫేక్ డాక్టర్ బాగోతాన్ని బట్టబయలు చేశారు పోలీసులు.మాట్రిమొనీ సైట్ లో తాను ఐఏఎస్ అని నమ్మించి వివాహం చేసుకున్నాడు సందీప్. పెళ్ళైన 6ఏళ్ళ తర్వాత బాగోతం బయటపడింది. వివిధ కారణాలు చెప్పి భార్య దగ్గర 2కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read : దొంగల తెలివి : ఓ ఇంట్లో చోరీ సెల్ ఫోన్లు.. మరో దోపిడీ ఇంట్లో వదిలేసిన దొంగలు

2018లో నకిలీ ఐఎస్ సందీప్ తో తనకు వివాహం అయ్యిందని, ఇద్దరు పిల్లలున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. సందీప్ 2016 బ్యాచ్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ ని అని, ఐఏఎస్ ఇష్టం లేక రేడియాలజీ ఎండీగా పని చేస్తున్నట్లు నమ్మించాడు సందీప్.వైద్యం ద్వారా 40కోట్లు వచ్చిందని, ఐటీ అధికారులు తన అకౌంట్ ఫ్రీజ్ చేశారని, అకౌంట్ రిలీజ్ అవ్వాలంటే 2కోట్లు చెల్లించాలని కట్టుకథలు చెప్పాడు సందీప్.

సందీప్ మాటలు నమ్మిన బాధితురాలు తనకు రెండు కోట్లు ఇచ్చినట్లు తెలిపింది. ఆ తర్వాత కూడా అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో పోలీసులను ఆశ్రయించింది సందీప్ భార్య. కేసు నమోదు చేసిన పోలీసులు సందీప్ ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.