వ‌ర్మ ఛాలెంజ్ చేస్తేనే మేం దాడి చేశాం : జనసేన కార్యకర్తలు

వ‌ర్మ ఛాలెంజ్ చేస్తేనే మేం దాడి చేశాం : జనసేన కార్యకర్తలు

డైరక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ ఆఫీస్ పై దాడిచేసిన ఏడుగురు వ్య‌క్తుల్ని జుబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట కు చెందిన ఆరుగురు జనసేన కార్యకర్తలు తో పాటు ఓయూ జేఏసీ నేత సంపత్ నాయక్ ఉన్నారు. ఇటీవలే ఆర్జీవి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ పవర్ స్టార్ సినిమా రిలీజ్ చేస్తాను తాను ఇంట్లో ఒక్కడినే ఉంటాను ఎవరైనా రావచ్చని ఛాలెంజ్ చేసిన నేపథ్యంలో ఈ దాడికి పాల్పడినట్లు జనసేన కార్యకర్తలు పోలీసుల విచారణలో వెల్లడించారు.