ఇద్దరు స్నేహితులను హత్యచేసిన దుర్మార్గుడు అరెస్ట్

ఇద్దరు స్నేహితులను హత్యచేసిన దుర్మార్గుడు అరెస్ట్

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పీఎస్ పరిధిలోని రాంరెడ్డినగర్ లో దారుణం జరిగింది. గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ కేసులో నిందితుడు భువనేశ్వర్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 26న జరిగిన ఘర్షణలో తన ఇద్దరు స్నేహితులను చంపేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరిచేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. ఉద్యోగం ఇప్పించలేదని స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. 

బాలానగర్ డివిజన్ ఏసీపీ గంగారాం తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన భునేశ్వర్ సింగ్(35) ఉద్యోగం కోసం రాంరెడ్డి నగర్ లో ఉన్న స్నేహితుల  వద్దకు వచ్చాడు. రోజులు గడిచినా అతడికి ఉద్యోగం రాలేదు.  ఫ్రెండ్స్ ఉద్యోగం ఇప్పించలేదనే అక్కసుతో రగిలిపోయాడు. దీంతో వీరి ముగ్గురి మధ్య రూమ్ లో గొడవ జరిగింది. క్షణికావేశంలో భువనేశ్వర్ సింగ్ తన స్నేహితులైన బీరేందర్ కుమార్ (35), ఇబాదత్ అన్సారీని తలపై కర్రతో గట్టిగా మోదాడు. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. దీన్ని ఆత్మహత్యగా క్రియేట్ చేసేందుకు ప్రయత్నించాడు. రూమ్ లో ఉన్న 2 గ్యాస్ సిలిండర్లను లీక్ చేసి నిప్పు పెట్టి పరారయ్యాడు. భారీ శబ్దంతో బ్లాస్ట్ అవ్వడంతో రూమ్ గోడ కూలిపోయిందని తెలిపారు.

చుట్టు పక్కల ప్రజలు భయబ్రాంతులకు గురై జీడిమెట్ల పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు.  ఘటన స్దలానికి చేరుకొని మృతులను గాంధీ ఆసుపత్రికి తరలించారని చెప్పారు. అనంతరం జీడిమెట్ల పోలీసులు 2 టీంలతో నిందితుడి  కోసం గాలించగా..నగరంలోనే ఉన్నాడనే సమాచారంతో భునేశ్వర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని ఏసీపీ వివరించారు.