కూకట్పల్లిలో పేకాటరాయుళ్ల అరెస్ట్

కూకట్పల్లిలో పేకాటరాయుళ్ల అరెస్ట్

హైదరాబాద్లో పలువురు పేకాటరాయుళ్లు అరెస్ట్ అయ్యారు. కూకట్పల్లిలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో తనిఖీలు చేపట్టగా.. పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారులు పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో కాంగ్రెస్ నేత, మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు సహా పలువురు వ్యాపారులు ఉన్నారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.