రేవంత్ రెడ్డి డ్రైవర్పై పోలీసుల దాడి....కారు డోర్ తెరిచి..బూతులు తిట్టి

రేవంత్ రెడ్డి డ్రైవర్పై పోలీసుల దాడి....కారు డోర్ తెరిచి..బూతులు తిట్టి

హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియం దగ్గర  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డ్రైవర్ కు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి డ్రైవర్‌పై పోలీసులు దాడి చేశారు.  కార్ డోర్ తీసి  ఉన్న డ్రైవర్ పై దాడి చేశారు. అతన్ని  బయటకు లాగే ప్రయత్నం చేశారు. ఎస్సైతో పాటు..కానిస్టేబుళ్లు అతనిపై చేయి చేసుకున్నారు. బండబూతులు తిట్టారు. తనపై పోలీసులు అకారణంగా పోలీసులు దాడి చేశారని రేవంత్ రెడ్డి డ్రైవర్ ఆరోపిస్తున్నాడు. 

రేవంత్ రెడ్డి డ్రైవర్ పై పోలీసులు దాడి చేసిన సమయంలో కార్లో రేవంత్ రెడ్డి లేడు. యువ సంఘర్షణ సభకు హాజరైన రేవంత్ రెడ్డిని...డ్రైవర్ సరూర్ నగర్ స్టేడియంలో లోపల దింపాడు. రేవంత్ రెడ్డి సభా వేదికపైకి వెళ్లిన తర్వాత పోలీసులకు ..డ్రైవర్ కు వాగ్వాదం జరిగింది. డ్రైవర్ పై పోలీసులు  దాడి చేస్తున్న సమయంలో  అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వారిని సైతం పోలీసులు లాగి పడేసి..రేవంత్ రెడ్డి డ్రైవర్ పై దాడి చేశారు.