హీరో నాగార్జున సోదరిపై పోలీస్ కేసు

హీరో నాగార్జున సోదరిపై పోలీస్ కేసు

టాలీవుడ్ హీరో నాగార్జున సోదరి నాగసుశీలపై మొయినాబాద్ పీఎస్ లో కేసు నమోదయ్యింది.  శ్రీజ ప్రకృతి దర్శపీఠం ఆశ్రమంపై దాడి చేశారని బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.  సెప్టెంబర్  12న నాగసుశీల మరికొంత మంది కలిసి శ్రీనివాసరావు ఇంటిపై దాడి చేశారని ఆరోపిస్తూ కంప్లైంట్ఇవ్వడంతో  ఘటనపై   మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

కొన్నేళ్లుగా కొనసాగుతున్న భూవివాదాలు

నాగసుశీల.. శ్రీ నాగ్ ప్రొడక్షన్ మేనేజింగ్  పార్ట్ నర్   చింతలపూడి శ్రీనివాస్ మధ్య గత కొన్నేళ్లుగా భూవివాదాలు ఉన్నాయి. వీళ్లిద్దరు చాలా ఏళ్లుగా వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. వీరిద్దరూ కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతో పాటు సినిమాలు కూడా నిర్మించారు. 

ALSO READ: కల్ట్ మామ కన్ను కొడితే.. కన్నె గుండెలు మెల్టే..

తనకు తెలియకుండా శ్రీనివాస్  తన భూములను విక్రయించాడని గతంలో పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు నాగసుశీల. అయితే  లాకప్‌లో పెట్టయినా తన చేత కంపెనీ ఆస్తులు రాయించుకునేందుకే తనపై నాగ సుశీల కేసు పెట్టారని శ్రీనివాస్ ఆరోపించారు. నాగ సుశీల కుమారుడు సుశాంత్ హీరోగా నాలుగు సినిమాలు తీసి భారీగా నష్టపోయామని అన్నారు. ఈ వివాదాల కారణంగా శ్రీనివాస్ నాగసుశీలపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.