కల్ట్ మామ కన్ను కొడితే.. కన్నె గుండెలు మెల్టే..

కల్ట్ మామ కన్ను కొడితే.. కన్నె గుండెలు మెల్టే..

పవర్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ స్కంద.  ఇప్పటికే రిలీజైన పోస్టర్లు,ట్రైలర్ సినిమాపై అంచనాను ఓ రేంజ్ లో పెంచింది. ఈ సినిమాలో మూడు లిరికల్ సాంగ్స్ విడుదల చేయగా..అవన్నీ..జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా  వినాయకచవితి సందర్భంగా కల్ట్ మామ లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.  

ALSO READ: హీరో నాగార్జున సోదరిపై పోలీస్ కేసు

థమన్‌ డైరెక్షన్ లో ..ఈ కల్ట్ మామ సాంగ్ను  హేమచంద్ర, రమ్య బెహరా, మహా పాడారు.  అనంత్ శ్రీరామ్‌ అందించిన లిరిక్స్‌  క్యాచీగా ఉన్నాయి. ఈ పాటకు రామ్‌ పోతినేని తన ఎనర్జిటిక్‌ స్టెప్స్‌తో మరింత హైప్ తీసుకొచ్చాడు. ఇక ఈ స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్‌ ఐటెం గర్ల్‌ ఊర్వశి రౌటెలా డ్యాన్స్ అదుర్స్. ఈ ఇద్దరి జోడి కలిసి చేసిన ఈ సాంగ్ ఫ్యాన్స్ ను కిక్కెస్తోంది. 

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన స్కంద మూవీలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటించింది. థమన్‌ మ్యూజిక్ అందించాడు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా  రిలీజవనుంది. ఇప్పటికే రిలీజైన అన్ని పాటలు చార్ట్‌ బస్టర్‌లుగా నిలిచాయి. తాజాగా విడుదలైన  ఈ స్పెషల్ సాంగ్‌ కూడా ఆ జాబితాలో చేరుతుందని మేకర్స్‌ అంచనా వేస్తున్నారు.