ప్రశాంత్ నీల్కు నచ్చిన హారర్ మూవీ ‘418’ రిలీజ్ ఎప్పుడంటే..

ప్రశాంత్ నీల్కు నచ్చిన హారర్ మూవీ ‘418’ రిలీజ్ ఎప్పుడంటే..

దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌‌‌‌‌‌‌‌ సంస్థ నిర్మిస్తున్న హారర్ మూవీ ‘418’. కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్య రాజ్ వీరబత్తిని, హను రెడ్డి, ‘పతంగ్‌‌‌‌‌‌‌‌’ ఫేమ్ ప్రీతి పగడాల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 23న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వరల్డ్‌‌‌‌‌‌‌‌ వైడ్‌‌‌‌‌‌‌‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

భయంతో కూడిన గ్రామంలోని మెడికల్ కాలేజ్‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో సైన్స్, మూఢనమ్మకానికీ అర్ధం కాని ఒక సీక్రెట్‌‌‌‌‌‌‌‌తో, సరికొత్త కథకథనాలతో గొప్ప సినిమాటిక్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్ ఇచ్చేలా ఈ చిత్రం ఉండబోతోందని మేకర్స్‌‌‌‌‌‌‌‌ తెలియజేశారు.  శ్రీ వైష్ణవ, శశాంక్ పాటిల్ ఇతర  కీలక పాత్రలు పోషించగా, వెంకీ జీజీ సంగీతం అందిస్తున్నాడు.