టైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈజ్ బ్యాక్.. ‘జైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2’ ట్రైలర్ వచ్చేసింది.. చూశారా..?

టైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈజ్ బ్యాక్.. ‘జైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2’ ట్రైలర్ వచ్చేసింది.. చూశారా..?

రజినీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘జైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2’. నెల్సన్‌‌‌‌‌‌‌‌ దిలీప్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌ సన్‌‌‌‌‌‌‌‌ పిక్చర్స్‌‌‌‌‌‌‌‌ నిర్మిస్తోంది. ‘జైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’కు ఇది సీక్వెల్‌‌‌‌‌‌‌‌. సోమవారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. టైగ‌‌‌‌‌‌‌‌ర్ ముత్తువేల్ పాండియ‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌గా మరోసారి కనిపించారు రజినీకాంత్‌‌‌‌‌‌‌‌. 

ఫస్ట్ పార్ట్‌‌‌‌‌‌‌‌కు మెయిన్‌‌‌‌‌‌‌‌ విలన్‌‌‌‌‌‌‌‌ అయిన వర్మను చంపిన ముత్తువేల్‌‌‌‌‌‌‌‌ పాండియన్‌‌‌‌‌‌‌‌ కోసం శత్రువులు వెతుకుతుంటారు. అయితే తన గురించి ఎవరికీ తెలియకుండా ఓ సాధారణ డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అజ్ఞాతంలో ఉంటాడు జైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. తనను వెతుక్కుంటూ వచ్చిన విలన్‌‌‌‌‌‌‌‌ గ్యాంగ్‌‌‌‌‌‌‌‌ను ఆయన ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ మూవీ మెయిన్‌‌‌‌‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌గా చూపించారు.

సూర‌‌‌‌‌‌‌‌జ్ వెంజ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌మూడు, ఎస్‌‌‌‌‌‌‌‌జె సూర్య,  మిథున్‌‌‌‌‌‌‌‌ చక్రవర్తి, విద్యాబాలన్‌‌‌‌‌‌‌‌ విలన్స్‌‌‌‌‌‌‌‌గా కనిపించారు.  రజినీకాంత్ మార్క్‌‌‌‌‌‌‌‌ స్టైల్‌‌‌‌‌‌‌‌, స్వాగ్‌‌‌‌‌‌‌‌, ఎలివేషన్స్‌‌‌‌‌‌‌‌,  మాస్‌‌‌‌‌‌‌‌ డైలాగ్స్‌‌‌‌‌‌‌‌తో సాగిన ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆకట్టుకుంది. ‘జైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో నటించిన రమ్యకృష్ణ, మిర్నా, యోగిబాబుతో పాటు పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌ క్యారెక్టర్స్‌‌‌‌‌‌‌‌తో గెస్ట్ అప్పీయరెన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన మోహన్‌‌‌‌‌‌‌‌లాల్, శివరాజ్‌‌‌‌‌‌‌‌కుమార్, జాకీ ష్రాఫ్‌‌‌‌‌‌‌‌ ఇందులోనూ కనిపించారు.  అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.  అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 15న సినిమా విడుదల కాబోతోంది.  తెలుగులో సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్‌‌‌‌‌‌‌‌ రిలీజ్ చేస్తోంది.