లోమేష్ పూడిపెద్ది, జయశ్రీ జంటగా ఆనంద్.కె. దర్శకత్వంలో పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మిస్తున్న చిత్రం ‘డ్యూ డేట్’. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకోగా, సోమవారం నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. హీరో, హీరోయిన్ ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా. ప్రజెంట్ బర్నింగ్ ఇష్యూ ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. ప్రతి మనిషి, ప్రతి నెలా గుర్తుపెట్టుకునే డ్యూ డేట్ చుట్టూ కథ తిరుగుతుంది. ప్రేక్షకులకు కొత్తదనంతో పాటు పూర్తి సంతృప్తిని కలిగించే కథ, కథనాలు ఈ చిత్రంలో ఉంటాయి. 15 రోజుల పాటు ఏకధాటిగా జరిగే షెడ్యూల్‌తో తొలి షెడ్యూల్ పూర్తవుతుంది’ అని చెప్పారు. ప్రణీత పట్నాయక్, విజ్క్షాని, కృష్ణ భగవాన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
