ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులపై పోలీసుల కేసులు

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులపై పోలీసుల కేసులు

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళనలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. తమ డిమాండ్లపై డీజీపీ ఆఫీస్, ప్రగతి భవన్, అసెంబ్లీ ముట్టడికి అభ్యర్థులు ప్రయత్నించారు. దీంతో అభ్యర్థులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. గురువారం పెట్రోల్ బాటిల్తో ఆందోళన చేసిన ఐదుగురు అభ్యర్థులపై కేసులు బుక్ చేశారు. తాజాగా అసెంబ్లీ పరిసరాల్లో ఆందోళన చేసిన 12 మందిపై కేసు నమోదు చేశారు. ఇక బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 16 మంది కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులపై 341,147,149,352,353 సెక్షన్స్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కాగా శాంతియుతంగా తమ గోడు చెప్పుకోవడానికి వస్తే కేసులు పెడుతున్నారని అభ్యర్థుల ఆవేదన వ్యక్తం చేశారు.