- మహారాష్ట్రకు చెందిన నలుగురు అరెస్ట్
ఎల్బీ నగర్,వెలుగు: లోక్ సభ ఎన్నికల వేళ తనిఖీల్లో భాగంగా ఫేక్ కరెన్సీ పట్టుబడిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు గురువారం ఎర్రకుంట వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. నిసాన్ కారులో మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు రూ.25లక్షల ఫేక్ కరెన్సీ తెస్తూ నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు.
వారిని అదుపులోకి తీసుకుని విచారించి మహారాష్ట్రకు చెందిన షేక్ హరుణ్, సయ్యద్ సగీర్, జాకీర్ సయ్యద్, అలీ ఆఫ్తాబ్ అత్తర్ గా గుర్తించారు. నిందితుల వద్ద కారు, 5 మొబైల్ ఫోన్స్ , రూ. 8, 240 నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. నిందితులు మూడు రెట్లు ఫేక్ కరెన్సీ ఇచ్చి ఒరిజినల్ నగదును తీసుకుని చలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.