
రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న తనిఖీలలో భారీగా బంగారం, నగదు పట్టుబడుతుంది. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు సరిహద్దులోని ఖంజాపూర్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అక్రమంగా తరలిస్తున్న 40 తులాల బంగారు ఆభరణాలను ఎన్నికల అధికారులు పట్టుకున్నారు.
హైదరాబాద్ నుంచి తాండూరుకు కారులో బంగారు ఆభరణాలను తరలిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. ఆ కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ హ్యాండ్ బ్యాగ్ లో బంగారు ఆభరణాలను గుర్తించామని పోలీసులు చెప్పారు. పట్టుబడ్డ బంగారం ఆభరణాలకు బిల్లులు చూపక పోవడంతో వాటిని పోలీసులు సీజ్ చేశారు.