
తూప్రాన్ , వెలుగు: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సోమవారం ఎస్ఐ శివానందం తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి మెదక్ జిల్లా నార్సింగ్ కు లారీలో పీడీఎస్బియ్యాన్ని తరలిస్తున్న విషయం తెలియడంతో పౌర సరఫరా అధికారులకు సమాచారం చేరవేశామన్నారు.
తూప్రాన్ శివారులో ఉన్న టోల్గేట్ వద్ద డీటీ సాధిక్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టగా లారీ లో 220 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించామన్నారు. అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పట్టుకున్న బియ్యాన్ని తూప్రాన్ లోని పౌరసరఫరాల గోదాంకు తరలించామని ఎస్ఐ తెలిపారు