మైనర్ రేప్ పై వీడిన మిస్టరీ : సినిమాకి వెళ్లిందటా..!

మైనర్ రేప్ పై వీడిన మిస్టరీ :  సినిమాకి వెళ్లిందటా..!

సంగారెడ్డి జిల్లా: మైనర్ బాలికపై అత్యాచారంపై మిస్టరీ వీడింది. అమీన్ పూర్, చక్రపురి కాలనీలో గురువారం  మైనర్ బాలికపై అత్యాచారాన్ని కట్టుకథగా తేల్చారు పోలీసులు. గురువారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు మైనర్ బాలికను పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. తల్లిదండ్రులకు భయపడ్డ బాలిక కూడా అసలు విషయం చెప్పకుండా రేప్ చేశారని తెలిపింది. అనుమానం వచ్చిన పోలీసులు మెడికల్ టెస్టులు చేయించగా.. బాలికపై అత్యాచారం జరగలేదని డాక్టర్లు కన్ఫమ్ చేశారు. దీంతో తమదైన శైలిలో బాలికను విచారించగా పోలీసులకు నిజం తెలిపింది బాలిక.

బుధవారం జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో సందీప్ (22) అనే యువకుడు పరిచయం అయ్యాడని.. అతడితో గురువారం ఉదయం సినిమాకి వెళ్లానని చెప్పింది. ఇంటికి రావడానికి ఆలస్యం కావడంతో తల్లిదండ్రులకు భయపడ్డ బాలిక.. గుర్తు తెలియని వ్యక్తులు తనను పొదల్లోకి లాక్కెల్లారని అబద్ధం చెప్పిందని తెలిపారు పోలీసులు. బాలికను సినిమాకు తీసుకెళ్ళిన సందీప్ ను  అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని  మైనర్ బాలిక అని చూడకుండా బాలిక ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేసినందుకుగాను.. కాలనీలో ఉన్న రవిఫై కూడా ఫోక్సో చట్టం ప్రకారం  కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు. బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు.

see also: పెళ్లి కావడంలేదని 20 ఏళ్ల యువకుడు సూసైడ్

బాలికను బెదిరించి..న్యూడ్ ఫోటోలు

17 ఏళ్ల అమ్మాయి అనుమానాస్పద మృతి