హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్

హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్

హైదరాబాద్: పోలీసు శాఖను బలోపేతం చేయడం వల్ల సమర్థవంతంగా శాంతిభద్రతల పరిరక్షణ సాధ్యమైందని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన శాంతి భద్రతల గురించి మట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేనంత ప్రశాంతంగా జనజీవనం సాగుతోందన్నారు. శాంతి భద్రతలను కాపాడినప్పుడే అభివృద్ధి వేగవంతం అవుతుందని, అందుకే తమ ప్రభుత్వం పోలీసు శాఖకు అత్యధిక బడ్జెట్ కేటాయించిందని చెప్పారు. నేరాలను అరికట్టడంతో పాటు, నేరగాళ్లను పట్టుకోవడంలో టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో త్వరలోనే అంతర్జాతీయ స్థాయి పోలిస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించబోతున్నామని చెప్పారు. ఇది అందుబాటులోకి వస్తే నేరాల నియంత్రణ మరింత సమర్థంగా చేయగలుగుతామని అన్నారు.

పేకాట, గుడుంబా వంటి దురాచారాలను పోలీస్ శాఖ సమర్థవంతంగా అరికట్టగలిగిందని కేసీఆర్ చెప్పారు. డ్రగ్స్, కత్రీల నిరోధానికి ఉక్కుపిడికిలి బిగించిందన్నారు. మహిళలకు భద్రత కల్పించడం కోసం షీటీమ్స్ విశేష కృషి చేస్తున్నాయని సీఎం అన్నారు.

ఫైల్ ఫొటో