పోలీస్ కమాండ్ కంట్రోల్ దేశానికే తలమానికం

పోలీస్ కమాండ్ కంట్రోల్ దేశానికే తలమానికం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ దేశానికే తలమానికమని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. దీన్ని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించామన్నారు. బుధవారం కమాండ్ కంట్రోల్  పనులను.. ప్రారంభోత్సవ ఏర్పాట్లను సీపీ సీవీ ఆనంద్ తో కలిసి మంత్రి పరిశీలించారు.

కమాండ్ కంట్రోల్ లో గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ సెంటర్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించి.. బిల్డింగ్ మొత్తాన్ని పరిశీలిస్తారని వివరించారు.  నిర్మాణంలో తనను భాగస్వామ్యం చేసినందుకు సీఎంకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.