అలంపూర్, వెలుగు: గద్వాల జిల్లా జోగులాంబ అమ్మవారి ఆలయ ఈవోపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలయంలో గత నెల నిర్వహించిన కూరగాయల పట్టణానికి చెందిన వై.శ్రీలత దక్కించుకుంది. అయితే ఆమె అన్య మతస్తురాలని ఈవో దీప్తి టెండర్‌ను రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలిచారు. దీంతో తాను దళిత మహిళను కాబట్టే టెండర్‌ను రద్దు చేసి అవమానించారని, ఈవోపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ శ్రీలత శుక్రవారం అలంపూర్ ఎస్సై వెంకటస్వామికి ఫిర్యాదు చేశారు.
