
అగర్తాలా: ఫేస్‌బుక్‌లో ప్రధాని నరేంద్ర మోడీని అవమానిస్తూ పోస్టులు పెట్టాడంటూ బంగ్లాదేశ్ సింగర్ మైనూల్ అహ్సాన్ నోబెల్‌పై త్రిపుర పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. కోల్‌కతాలో జరిగిన మ్యూజిక్ రియాలిటీ షో ‘సరిగమప’ ద్వారా మనదేశంలో మైనూల్ ఫేమస్ అయ్యారు. మైనూల్ తన ఫేస్‌బుక్ వాల్‌పై ‘ప్రధాని మోడీ కేవలం టీ అమ్ముకునేవాడు’ అంటూ కామెంట్ చేశారని పోలీస్ స్టేషన్ ఆఫీసర్ రాజీబ్ దత్తా తెలిపారు. గుజరాత్ గాంధీనగర్‌లోని పండిట్ దీన్ దయాల్ వర్సిటీకి చెందిన స్టూడెంట్ సుమన్‌పాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. దీనిపై ఇప్పటికే విచారణ ప్రారంభమైందన్నారు.