
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. లా అండ్ ఆర్డర్ డీసీపీ రవికుమార్, ఏసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో ఎలాంటి పత్రాలు లేని 52 టూవీలర్స్, 13 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల భద్రత కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.