వివాహేతర సంబంధం వల్లే హత్య ...నిర్మల్ పట్టణంలోని  మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

వివాహేతర సంబంధం వల్లే హత్య ...నిర్మల్ పట్టణంలోని  మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

నిర్మల్, వెలుగు: నిర్మల్ పట్టణంలోని శ్యామ్‌‌గడ్ కోట వెనుక ఈ నెల 24న జరిగిన హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. కేసు వివరాలను ఏఎస్పీ సాయి కిరణ్ శుక్రవారం వెల్లడించారు. మృతుడు గజానంద్‌‌తో పాటు నిందితులు గుపాల్వాడ్ శ్రీనివాస్, వెంకటేశ్, రాజు ఒకరికొకరు తెలియకుండా తిరుమల అనే మహిళతో వివాహేతర సంబంధాలు కొనసాగించినట్లు దర్యాప్తులో తేలింది. 

ఈ విషయం బయటపడడంతో గజానంద్ ఆమె తనకే సొంతమని చెప్పుతూ మిగతావారితో తరచూ గొడవపడేవాడు. ఈ నెల 24న శ్రీనివాస్​, వెంకటేశ్​, రాజు కలిసి గజానంద్‌‌కు మద్యం తాగించి శ్యామ్‌‌గడ్ సమీపంలోని కోట వెనుకకు తీసుకెళ్లారు. అక్కడ కట్టెలతో దాడి చేసి, బీరు సీసాలతో గాయపరిచి హత్య చేశారు. డెడ్​బాడీని నీటి గుంతలో పడేసి పరారయ్యారు. ఈ ఘటనపై 25న మృతుడి మేనత్త ఫిర్యాదు మేరకు టౌన్ పీఎస్‌‌లో కేసు నమోదు చేశారు. పోలీసులు తిరుమల, గుపాల్వాడ్ శ్రీనివాస్‌‌ను అరెస్ట్ చేశారు. వెంకటేశ్, రాజు పరారీలో ఉన్నారని ఏఎస్పీ తెలిపారు.