పట్టుబడిన మద్యం ధ్వంసం

పట్టుబడిన మద్యం ధ్వంసం

చేవెళ్ల, వెలుగు: అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో భాగంగా అక్రమంగా పట్టుబడిన మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. వేల లీటర్ల మద్యం విలువ రూ. లక్షల్లో ఉంటుంది. గురువారం సైబరాబాద్ కమిషనరేట్ పరిధి మొయినాబాద్ పీఎస్ ఆవరణలో ఎక్సైజ్ శాఖ ఆదేశాల మేరకు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ విజయ్ కుమార్, ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్యర్యంలో సుమారు 8,561 లీటర్ల మద్యం సీసాలను జేసీబీలతో పగులగొట్టారు.

ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు అక్రమంగా మద్యం తరలించగా.. రాజేంద్రనగర్ జోన్ లోని 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో అక్రమంగా రవాణా, విక్రయిస్తుండగా.. ఎక్సైజ్, పోలీసులు దాడులు చేసి పట్టుకుని సీజ్ చేశారు. 999  కేసులు నమోదు చేశారు. మొయినాబాద్ సీఐ పవన్​ కుమర్​రెడ్డి, ఎక్సైజ్ సీఐ ప్రదీప్ కుమార్, పోలీసులు సిబ్బంది ఉన్నారు.