జగిత్యాలలో 16 మంది బంగ్లా దేశీయుల అరెస్ట్

జగిత్యాలలో 16 మంది బంగ్లా దేశీయుల అరెస్ట్

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాలలో 16 మంది బంగ్లా దేశీయులను పోలీసులు గుర్తించారు. తాండ్రియాలలో అనుమానస్పదంగా తిరుగుతున్న కొందరు వ్యక్తులను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారిని నిలదీసి అడిగితే కూలీ పనికి వచ్చామని వారంతా స్థానికులతో అన్నట్లు సమాచారం. 

తాండ్రియాలలో అనుమానాస్పదంగా తిరుగుతున్న బంగ్లాదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పీఎస్ తరలించి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశీయులు ఎందుకొచ్చారు? ఇక్కడ ఎందుకు సంచరిస్తున్నారనే విషయాలపై అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.